క‌డ‌ప‌ రాయ‌ల‌సీమ

చేతులెత్తి మొక్కుతా..!

Share

సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య వేడుకోలు..
గృహ నిర్మాణ దారులకు రెండు లక్షలు అప్పుగా ఇప్పించడి సీఎం గారు..!

లక్షా 80 వేలతోనే ఇళ్లు పూర్తి అవ్వడం లేదు కనీసం నాలుగు లక్షలు అవుతుంది కనీసం అప్పుగా అయినా ప్రతి ఒక్కరికి రెండు లక్షలు ఇప్పించడి మహప్రబో..!

రాష్ట్రప్రభుత్వం తరుపున పైసా ఇవ్వకుండా,కేంద్రమిచ్చే రూ.లక్షా 80 వేలతోనే ఇళ్లుకట్టుకోవాలని చెప్పడం దారుణమని, ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలను అప్పులపాలు చేయడం ముఖ్యమంత్రికి తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన రూ.లక్షా 80 వేలలో మొత్తం కేంద్ర ప్రభుత్వసొమ్మే తప్ప రాష్ట్రవాటా పైసాకూడాలేదని అన్నారుప్రస్తుత పరిస్థితుల్లో కూలీల ఖర్చులకే రూ.లక్షా 80 వేల సరిపోతుందని సిమెంటు, ఇటుకలు,ఇసుకను ఎలా కొనుగోలు చేయాలని ప్రస్తుత కరోన కష్ట కాలంలోనని ప్రశ్నించారు?ప్రభుత్వం చెప్పినట్లుగా ఇల్లుకట్టాలంటే తక్కువలో తక్కువ రూ.4 లక్షలు అవుతుందన్నారు

ఇనుముతో పాటు అదనంగా లేబర్ ఛార్జీలకు ఇంకెంతవుతుందో చెప్పాల్సిన పనిలేదని,పేదల ఇళ్లను ఇలా మొండిగోడలకు పరిమితంచేసే బదులు,రాష్ట్రప్రభుత వాటాగా రూ 2.లక్షల రూ అదనంగా ఇవ్వొచ్చుకదా అన్నారు.ముఖ్యమంత్రి,మంత్రులు, అధికారులు ఆదిశగా ఆలోచించి, పేదలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఇళ్లు అందేలా చూడాలన్నారు.

గతంలో ఒకటేమో లబ్ధిదారులే సొంతంగా వారి సొమ్ముతో ఇళ్లు కట్టుకోవడం, రెండోదేమో ఇంటినిర్మాణానికి అవసరమైన సామగ్రి మొత్తం ప్రభుత్వమే ఇవ్వడం, కూలీల ఖర్చుని లబ్ధి దారులు భరించడం కాగా ఇక మూడోది ప్రభుత్వమే ఇళ్లుకట్టించి ఇవ్వడం జరుగుతుందని లబ్ధిదారులు ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చని కూడా చెప్పారన్నారని గుర్తు చేశారు.

ఇంటి నిర్మాణానికి అవసరమైన టన్ను ఐరన్ రూ.55 వెలనుంచి రూ.70వేలవరకుఉంది. ట్రాక్టర్ ఇసుకకు రూ.3వేలనుంచి రూ.5వేలకు తీసుకుంటున్నారని,
అలానే సిమెంట్ కంపెనీని బట్టి ఒకబస్తా రూ.250నుంచి రూ320వరకు అమ్ముతున్నారని,
ఇవికాకుండా కూలీల ఖర్చుతో తడిసి మోపిడు అవుతున్నదని ఆరోపించారు.

ప్రభుత్వమే మంచి నాణ్యత ప్రమాణాలతో పేదలకు ఇళ్లుకట్టించి ఇస్తే ఏ సమస్యా లేదని,ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువలో తక్కువగా ప్రభుత్వము మంజూరు చేసిన స్థలంలో ఇంటినిర్మాణానికి రూ.4 లక్షలు అవుతుందన్నారు.

కూలీల ఖర్చుని పరిశీలిస్తే, ఇప్పుడు ఒక్కోమేస్త్రికి రూ.700వరకు కూలీ ఉందని ఇంటి నిర్మాణానికి సుమారుగా 60 మంది మేస్త్రీలు పట్టొచ్చని అంచనా. 60 మందికి కూలీలకు రూ.42 వేల వరకు అవుతోంది.లేబర్ కి ఒక్కొక్కరికి రూ.500వేసుకున్నా సుమారుగా రూ.30వేలవరకు అవుతుందన్నారు మెత్తం 72 వెలు ఇక సిమెంట్ విషయానికి వస్తే, 200 బస్తాలు పడుతుంది అంటున్నారు. బస్తా రూ.300 చొప్పునవేసుకున్నా 200 బస్తాలకు రూ.60వేలవరకు అవుతోందని,ఒక్కో ఇంటికి రూ. 8 వేల ఇటుకలు పడుతాయని నిర్మాణ సంస్థలు పేర్కొంటున్నాయన్నారు.ఒక్కో ఇటుక రూ.6చొప్పున వేసుకున్నా ఇటుకలకే రూ.48వేలు అవుతోందని,ఇటుక, సిమెంట్, మేస్త్రికూలీకే రూ.లక్షా80వేలు అవుతోందని ఇనుము ఎక్కడినుంచి వస్తుందని ప్రశ్నించారు.

లక్షా 80 వేలకు తోడు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో లక్ష 80 వేలు అదనంగా ఇస్తే ఇల్లు నిర్మించుకోవచ్చునన్నారు.గత ప్రభుత్వాలు కేంద్రం ఎంతిస్తే అంతే సమానంగా నిధులు సమకూర్చెదనేది గుర్తిరేగులన్నారు.

ముఖ్యమంత్రి అలాఎందుకు ఆలోచించడంలేదని? గత ప్రభుత్వహాయాంలో ఒక్కోఇంటి నిర్మాణానికి రూ.2లక్షల50వేలు ఇచ్చారని, తరువాత వాటికి అదనంగా ఎస్సీ,ఎస్టీలకు రూ. 50వేలు ఇచ్చారని, అవికూడ చాలామంది కట్టుకోలేకపోయారని.ఇవేవీ ముఖ్యమంత్రి,అధికారులు తెలియదాని ఎందుకు ఆలోచించరని ప్రశ్నించారు?.

ప్రభుత్వమిచ్చే లక్షా80వేలతో చుట్టూ గోడలుపెట్టి రేకులు వేసుకోవడమే, ఎక్కడా నిర్మాణాలు పూర్తి కావని స్పష్టం చేశారు. ఇవన్నీ ఆలోచించి, ముఖ్యమంత్రి గారు కనీసం అప్పుగా అయినా ప్రతి ఒక్క లబ్ది దారునికి రెండు లక్షలు ఇప్పించి ఇండ్లు పరిపూర్ణంగా చేసి, పేదలకు న్యాయం చేయాలని వేడుకోలు చేశారు.


Share

Related posts

హౌసింగ్ జాయింట్ కలెక్టర్,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ లెవెల్ సమీక్ష సమావేశం

manarayalaseema

పేదలనూ మోసం చేసిన జగన్ ప్రభుత్వం..

manarayalaseema

అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల, భూకబ్జా కోరుల పేర్లు భహిర్గతం చేస్తాం – జి.ఈశ్వరయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్

manarayalaseema

Leave a Comment