Uncategorized

రాయలసీమ వాసులం!

Share

మేము రాయలసీమ వారము!
మాలో ఎక్కువ మంది తింటారు కారము!
లోన ఒకటి బయట ఒకటి లేని వారము!
ముక్కు సూటిగా మాట్లాడే వారము!
మాలో లేదు వెటకారము!
అన్యాయాలపై చేస్తాము ధిక్కారము!
మాకెక్కువ మమకారము!
మంచికి ప్రాణమిచ్చే వారము!
ఉత్తినే ఎవరికీ చేయము అపకారము!
మాకు చేతనయునంత చేస్తాము ఉపకారము!
మాలో కొంతమందికి కావాలి అధికారము!
అది లేకుండా ఉండలేరు కొంతకాలము!
మాలో కొందరి చర్యలు భయంకరము!
భూ కబ్జాలకై కొంతమంది చేస్తారు బలాత్కారము!
వారు వెళ్లి వస్తుంటారు తరచూ కారాగారము!

ముందు ఎక్కువగా ఉండేవి గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు!
ఉండేవి ఎక్కువగా పగలు ప్రతీకారాలు!
అవి బాగా తగ్గుతున్నాయన్న వార్తలు సంతోషకరాలు!
మా పల్లెలనుండి అవుతున్నారు. ఎక్కువ మంది పట్టభద్రులు!
ఉద్యోగాలకై జాతీయ స్థాయిలో పడుతున్నారు పోటీలు!
సాధిస్తున్నారు అత్యున్నత స్థానాలు!
అధిరోహిస్తున్నారు ఉన్నతోద్యోగాలు!

రాయలసీమ కాదిక కత్తుల సీమ!
వినబోమిక బాంబుల మోత!
మార్చుకోవాలి సినిమా వారు…
వారి అభిప్రాయాన్ని రాయలసీమ పైన!
కాబోదిక రాయలసీమ కక్షల సీమ!
ఇప్పుడిప్పుడే అవుతోంది చదువుల సీమ!

పి.వి.కృష్ణారావు, కడప.
విశ్రాంత ఉపసంచాలకులు,
భూగర్భ జలశాఖ, కడప.సెల్:9618858532.


Share

Related posts

హిందీ భాషను ప్రజలపై బలవంతంగా రుద్దడం వెనుక ఓ కుట్ర – CPI రాష్ట్ర నాయకులు గుజ్జల ఈశ్వరయ్య

manarayalaseema

సాయి శ్రీ ఫీజీయో థెరపీ క్లినిక్ ను ప్రారంభించిన వైఎస్ భాస్కర్ రెడ్డి,మనోహర్ రెడ్డి

manarayalaseema

శ్రీ కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం  విజయవంతం చేయాలి : టిటిడి ఇ ఓ జవహర్ రెడ్డి 

manarayalaseema

Leave a Comment