ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు

ఏపీపీఎస్సీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి ! – డిఆర్వో మాలోల

Share

కడప జిల్లాలోని ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో ఏపిపిఎస్సి ద్వారా పలు శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న ఆన్ లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ )లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల తెలిపారు.

కలెక్టరేట్లోని స్పందన హాలులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసిస్టెంట్ ఇంజనీర్స్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షల నిర్వహణపై విధులు కేటాయించిన సంబంధిత అధికారులు, ఆయా సెంటర్ల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన ఒక సెషన్, 15వ తేదీన రెండు సెషన్లలో నిర్వహించనున్న అసిస్టెంట్ ఇంజనీర్స్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు.  పరీక్షలకు విధులు కేటాయించిన అధికారులందరూ.. పరీక్ష తేదీల్లో ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాల్సి ఉంటుందన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు పరీక్ష  కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష  కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చీఫ్ సూపరువైజర్లు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సూచించారు.

పోలీసు శాఖ ప్రతి సెంటర్లో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి కొరత లేకుండా ఆయా పరీక్ష కేంద్రాల యాజమాన్యాలు అన్ని వసతులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.అలాగే ఆర్టీసీ, విద్యుత్తు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, చీఫ్ సూపర్ ఇన్ టెండెంట్స్, లైజన్ ఆఫీసర్లు చేయవలసిన విధులపై ఆయన దిశా నిర్దేశం చేశారు.

జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.

** *కడప నగర పరిధిలో 5 కేంద్రాలు..*

1) అన్నమాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్.
2) కందుల ఓబుల రెడ్డి మెమోరియల్  కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
3) కెఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
4) శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
5) ఎస్.వి.కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్.

** *ప్రొద్దుటూరులో- మూడు  కేంద్రాలు..*

1) సాయి రాజేశ్వరి  ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
2) చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
3) వాగ్దేవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

ఈ కార్యక్రమంలో ఏవో గంగయ్య , ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ నవ్యజ్యోతి, జిల్లాలోని విద్యుత్, ఆరోగ్య , పోలీసు, ట్రెసరి, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, పరీక్ష నిర్వహణ కేంద్రాల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు….


Share

Related posts

WANTED INTERNSHIP

manarayalaseema

Leave a Comment