క‌డ‌ప‌

అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల, భూకబ్జా కోరుల పేర్లు భహిర్గతం చేస్తాం – జి.ఈశ్వరయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్

Share

మాట్లాడుతున్న గుజ్జల ఈశ్వరయ్య

జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్న భూమాఫియా అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అరికట్టాల్సిన తహసిల్దార్లు కబ్జాదారుల కొమ్ముకాస్తున్నారని త్వరలో పూర్తి వివరాలను భహిర్గతం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య తెలిపారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన

పేదలకు రెండు సెంట్ల ఇంటిస్థలం, రెండెకరాల సాగు భూమి పంచడానికి నిరాకరిస్తున్న అధికారులు, అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు

రెవిన్యూ రికార్డుల ఆధారంగా విలువైన ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, దేవాదాయ, భూదాన, ఇనాం, వక్స్, అసైన్మెంట్

భూములపై తప్పుడు పత్రాలను సృష్టించి ఆక్రమించి అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అసైన్మెంట్ కమిటీ సమావేశాలు విధిగా నిర్వహించి ఎమ్మెల్యే నేతృత్వంలో ఆర్.డి.ఓ, ఎమ్మార్వో, గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి అర్హులైన పేదలకు రెండెకరాల సాగు భూమి పంపిణీ మినహా గత 12 సంవత్సరాలుగా అసైన్మెంట్ సమావేశాలకే నోచుకోలేదన్నారు. దశాబ్దాల తరబడి సాగులో ఉన్నప్పటికీ పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం స్థానిక అధికారపార్టీ నేతల ప్రోద్భలంతో తహసిల్దార్లకు భారీ నజరానాలు

ముట్టజెప్పి తమ పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయించుకుంటున్నారన్నారు. అసైన్మెంట్ ఆక్ట్ ప్రకారం అసైన్మెంట్ కమిటీలో ఆమోదం పొంది, డి.కె.టి పట్టాతో పాటు పట్టాదారు పాసుపుస్తకం. పొందిన రైతు అమ్మడం గాని కొనడం గాని చెల్లదని స్పష్టంగా ఉన్నప్పటికీ భూఆక్రమణా దారులు యదేచ్చగా క్రయ, విక్రయాలు కొనసాగిస్తున్నారన్నారు. జిల్లాలో నిషేదిత భూముల జాబితాలో ఉన్న ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, దేవాదాయ, భూదాన, ఇనాం,వక్స్,అసైన్మెంట్ భూములను రిజిస్టర్ చేయకూడదని ఉన్నప్పటికీ మామూళ్ళు తీసుకుని రిజిస్టర్ చేస్తున్నారని ఆరోపించారు.

పేదవాడు విదిలేక జానెడు జాగాలో గుడిసె వేసుకున్నా, రెండెకరాలు గుట్టపొరంభోకు సాగుచేసుకున్నా ఆగమేఘాల మీద తహసిల్దార్లు, పోలీసులు వచ్చి అక్రమ కేసులు బనాయించి, జైళుకు పంపుతున్నారని అదే భూములను కొంతమంది పెద్దమనుషులు రెండెకరాలు పట్టాభూమి కొనుగోలు చేసి చుట్టూ ఉన్న ప్రభుత్వ వంక, చెరువు పొరంబోకు 10 ఎకరాలను ఆక్రమించి కంచెవేసి సోలార్ పెన్సింగ్తో ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నా అటువైపు కూడా తహసిల్దార్లు గాని, పోలీసులు గాని వెల్లకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి తన ఆర్థిక అరాచకం వల్ల ఏర్పడుతున్న లోటును పూడ్చుకునేందుకు గాను పేదలకు గతంలో ఇచ్చిన పక్కాగృహాలపై ఓటిఎస్ విధానం అమలుకోసం లబ్ధిదారులు ఓటిఎస్ ద్వారా డబ్బు చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చే అగ్రిమెంట్ పత్రాలను తనకాపెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనే ప్రకటన భూకబ్జాదారుల అక్రమాలకు రెక్కలొచ్చాయన్నారు. భవిష్యత్ అసైన్మెంట్ భూములను, డికెటి భూములను అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు రిజిస్టర్ అవుతాయని నమ్మబలుకుతూ యదేచ్చగా ఆక్రమిస్తున్నారన్నారు.

భూముల ఆన్లైన్ విధానం వచ్చిన తరువాత రైతులకు అధికారుల చుట్టూ తిరిగే తిప్పలు తగ్గుతాయిని అనుకున్నప్పటికీ అధికారుల వైఖరి వల్ల తిప్పలు రెట్టింపు అయ్యాయన్నారు. భూముల ఆన్లైన్ పేరుతో ఒకరి భూమి మరొకరికి నమోదు చేసి సరిదిద్దాలంటే సదరు రైతు వచ్చి వ్రాతపూర్వకంగా ఒప్పుకున్న తరువాతనే భూమి నమోదులో తప్పులను సరిదిద్దుతామని చివరకు భూమి విలువను బట్టి మామూళ్ళు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్ నమోదులో ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేసి అడ్డగోలుగా దొరికిపోయి చివరికి రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలతో సస్పెండ్ అయ్యిన తహసిల్దార్లను తిరిగి అదేస్థానంలో తీసుకువచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు వెనకాడడం లేదంటే ఎంత పెద్దఎత్తునా భూదందా నడుస్తున్నదో అర్థమవుతుందన్నారు. కొంతమంది తహసిల్దార్లు, పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారని ఈక్రమంలో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా లేఔట్లు వెలుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ఒక లేఔట్ వేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూటికి నలభై శాతం భూమి రోడ్లు, కాలువలు, పార్క్ లు, పాఠశాలలు, కమ్యూనిటీ డెవలప్మెంట్కు కేటాయించాలని అందుకు ముందుగా ల్యాండ్ కన్వర్షన్కు రెవిన్యూకు డబ్బు చెల్లించి దరకాస్తు చేసుకుంటే భూమి స్వభావాన్ని మార్చే క్రమంలో సదరు భూమి మునకకు గురవుతుందా లేక పర్యావరణ సమతుల్యతకు ముప్పు వాటిల్లుతుందా వంటి విషయాలను పరిగణలోకి తీసుకోకుండా అడ్డగోలుగా అనుమతులిస్తున్నారని ఫలితంగా చిన్నపాటి వర్షాలకే మునకకు గురవుతున్నాయని, అనుమతుల్లేని నిర్మాణాల పేరుతో భారీగా పన్నుల భారం ప్రజలపై పడుతుందని అన్నారు. త్వరలో భూకబ్జాలకు పాల్పడిన సహకరించిన అధికారులు భూ కబ్జా కొరకు సిద్ధం చేస్తామని ఆయన హెచ్చరించారు ఇన్ని అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా వచ్చాయి అనే దానిపైన అధికారుల ఆలయాలపై విచారణ చేపట్టాలని చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు గాలి చంద్ర,పి చంద్రశేఖర్,యం.వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


Share

Related posts

ఒంటిమిట్టలో జరుగుతున్నది సీతారామకళ్యాణమా..!144 సెక్షనా.? – టిడిపి నేత హరిప్రసాద్ మండిపాటు

manarayalaseema

రా రా శత జయంతి సభకు అందరూ ఆహ్వానితులే

manarayalaseema

పోలీసులా… వైకాపా కార్యకర్తలా.. ! – టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపాటు

manarayalaseema

Leave a Comment