Uncategorized

హిందీ భాషను ప్రజలపై బలవంతంగా రుద్దడం వెనుక ఓ కుట్ర – CPI రాష్ట్ర నాయకులు గుజ్జల ఈశ్వరయ్య

Share

పరిపాలన చేతకాకే దేశంలో కుల మత, ప్రాంతీయ భాషా సంస్కృతి వైషమ్యాలు సృష్టిస్తున్న బీజేపీ

ఆర్ యస్ యస్ పన్నాగాలు సాగానివ్వొద్దు..

జగన్,చంద్రబాబుల మౌనం కేసులకు భయపడే.?

ఉన్మాదం వైపు అడుగేస్తున్న ప్రభుత్వం నుంచి దేశ ఐక్యతను కాపాడుకోవాలని గుజ్జల ఈశ్వరయ్య పిలుపు

మరో మారు దేశ వ్యాప్తంగా హిందీ భాష రగడ రగులుకుందని, ఇందుకు కర్త,కర్మ,క్రియ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాయేనని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పార్లమెంటరీ అధికార భాషా ఛైర్మన్‌ హోదాలో అమిత్‌షా మాట్లాడుతూ హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలు కమ్యూనికేషన్‌ భాషగా ఇంగ్లీషుకు బదులు తప్పనిసరిగా హిందీని వాడాలని హుకుం జారీ చేసినంత పని చేశారని ఆరోపించారు

భావ వ్యక్తీకరణకు ఏ భాష అనువుగా ఉంటే ఆ భాషను వాడతారనే విషయం గుర్తెరగాలన్నారు

భాష ప్రజల ప్రాథమిక హక్కు.
ఏ భాషను ఉపయోగించాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని అన్నారు

ఫలాన భాషే మాట్లాడాలని శాసించే అధికారం కేంద్రానికి ఎంతమాత్రం ఉండదని విమర్శించారు

ఒక పథకం ప్రకారం హిందీని రుద్దే చర్యలో భాగంగానే అమిత్‌షా ఈ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యమన్నారు

దేశం మొత్తం మీద హిందీ మాతృభాషగా ఉన్న జనాభా 20 శాతం మించి లేదని,తక్కిన 80 శాతం మీద ఈ భాషను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం ఆయా భాషల, జాతుల ఉనికి మీద, స్వయంప్రతిపత్తి మీద తలపెట్టిన దాడి అని ఆగ్రహం వ్యక్తంచేశారు

భిన్న జాతుల, భిన్న భాషల, భిన్న సంస్కృతులను గుర్తించి గౌరవించే బదులు వాటిని అణగదొక్కి ఏకరూప ఆధిపత్య సంస్కృతిని బలవంతంగా రుద్దడమే అన్నారు

ఇది దేశ ప్రజల మీద, రాజ్యాంగ స్ఫూర్తి మీద ప్రత్యక్ష దాడి అని స్పష్టంచేశారు

అమిత్‌షా ‘హిందీ’ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు,హిందీయేతర రాష్ట్రాలు భగ్గుమన్నాయని,ఆంధ్ర ప్రదేశ్ లో జగన్,చంద్రబాబు కిమ్మనకుండా ఉండటం కేసులకు భయపడే అన్నారు

తమ సాంస్కృతిక, భాష, ప్రాంత, అస్తిత్వంపై కేంద్రంలోని బిజెపి చేస్తున్న దాడిగా స్థానిక ప్రజలు పరిగణిస్తున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు
అసోంలో టెన్త్‌ వరకు హిందీని తప్పనిసరి చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు

అసోం సాహిత్య సభ తప్పుబట్టిందని. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్రం ప్రకటించడంపై ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు, సాహిత్యకారులు, భాషా పరిరక్షకులు అసమ్మతి తెలుపుతున్నారన్నారు

దక్షిణాది పార్టీలు కేంద్రంపై ఘాటైన విమర్శలే సంధించాయి. బిజెపి ఏకీకృత ఎజెండాలో భాగమే హిందీ రగడ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విరుచుకుపడ్డారని అన్నారు

ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఎఐడిఎంకె బిజెపికి మిత్రపార్టీ. అయినప్పటికీ హిందీని రుద్దే విషయంలో ఊరుకోబోమందన్నారు

ఇంగ్లీషు కారణంగానే బెంగళూరు దేశ ఐ.టి రాజధాని కాగలిగిందని కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్‌ డికె శివకుమార్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారన్నారు

తెలుగు మాట్లాడే తెలంగాణ రాష్ట్ర అధికారపార్టీ అమిత్‌షా వ్యాఖ్యలను ఆక్షేపించగా,
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసిపి నోరు మెదిపే ధైర్యం చేయడంలేదు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పుట్టిన ప్రతిపక్ష టిడిపి సైతం గమ్మునుందన్నారు.
ఈ రెండు పార్టీలకు తెలుగు భాషపై ఎంత ప్రేమ ఉందో వారి వైఖరే తెలియజేస్తోందన్నారు

సాంస్కృతిక ఆధిపత్యం కోసం హిందూత్వ ముద్రతో కూడిన జాతీయ వాదానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సాన పెడుతుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆ వాదాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని మండిపడ్డారు
ఆ కొనసాగింపులోనిదే హిందీ మంత్రం. నూతన విద్యా విధానంలోనూ అదే సూత్రం అన్నారు

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అనేక భాషలు, ప్రాంతాల మేలు కలయిక. బహుళ సంస్కృతుల పట్ల గౌరవం అవశ్యం. బహుత్వాన్ని
గుర్తించాలని,అధికారంలో ఉన్నవారు విస్మరించరాదని రాజ్యాంగం ఇదే విషయాన్ని నొక్కివక్కాణించిందన్నారు
కానీ ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ద్వయం ప్రజల మధ్య చీలికలు పెట్టేందుకు పనిగట్టుకొని పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు

బాబ్రీ మసీదు కింద రామాలయం ఉందన్నా, పౌరసత్వ బిల్లు అయినా, కర్ణాటకలో నిన్నమొన్నటి హిజాబ్‌, హలాల్‌, ఆజాద్‌ వివాదాలను తీసుకున్నా, గుంటూరులో జిన్నా టవర్‌, తాజాగా లేవనెత్తిన ఢిల్లీ కుతుబ్‌మినార్‌ గొడవైనా అంతర్లీనంగా కనిపించేది అప్రధానమైన, అనవసరమైన వివాదాలు సృష్టించడం, ప్రజల దృష్టిని పక్కదారి మళ్లించడం, వారిలో చీలికలు సృష్టించడం, ఈ నడుమలో కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టడమే బీజేపీ కుట్ర అన్నారు

ఈ కుట్రను ఓడించాలి. హిందూత్వ ఉన్మాద జాతీయవాదాన్ని దాని ప్రతిరూప రాజకీయ సైద్ధాంతిక పోరాటాలతోనే ఎదుర్కోవాలి.

పరిపాలన చేతకాక దేశంలో కుల మత ప్రాంతీయ తత్వాలు జాతి భాషా వైషమ్యాలు సృష్టించడమే లక్ష్యంగా ఆర్ ఎస్ ఎస్ కనుసన్నలలో బీజేపీ కొనసాగిస్తోంది ప్రగతి శీలకులు బీజేపీ కుట్రను తిప్పికొట్టాలని,
ఈ కర్తవ్యాన్ని అన్ని పార్టీలూ, ప్రజలందరూ స్వీకరించాలని పిలుపునిచ్చారు


Share

Related posts

సరికొత్త ఆలోచనలతో.. ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలి – జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

manarayalaseema

AKFI నుంచి శ్రీదేవి , రాంబాబు ప్యానల్ కు ఆహ్వానం..

manarayalaseema

సాయి శ్రీ ఫీజీయో థెరపీ క్లినిక్ ను ప్రారంభించిన వైఎస్ భాస్కర్ రెడ్డి,మనోహర్ రెడ్డి

manarayalaseema

Leave a Comment