క‌డ‌ప‌

ఫోర్జరీ సంతకాలతో డీకేటీ పట్టాలు తయారుచేసే ముఠాపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు బి. నారాయణ

Share

జిల్లాలోని బద్వేల్, కడప, ప్రొద్దుటూరు పట్టణాలలో విలువైన ప్రభుత్వ భూముల సర్వేనెంబర్ లలోని భూములకు ఫోర్జరీ సంతకాలతో డికెటి పట్టాలు తయారుచేసి అమ్ముతున్న ముఠాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు బి. నారాయణ కోరారు. శుక్రవారం కలెక్టరేట్ ఏవో ద్వారా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఫోర్జరీ సంతకాలతో డికెటి పట్టాలు తయారుచేసి అమ్ము కోవడమే వృత్తిగా ముఠాలు తయారై చేస్తున్నాయని తెలిపారు. ఈ ముఠాలకు కొందరు అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని వారు చెప్పారు. బద్వేల్ పట్టణంలో భాగంగా ఉన్న బద్వేలు, గోపవరం మండలాలలోని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఫోర్జరీ సంతకాలతో డికెటి పటాల తయారీ ముఠాల చేతులలో రకరకాల పేర్ల పై వందల పట్టాలు ఉన్నట్లు ఒక అనదికారిక లెక్క ద్వారా తెలుస్తుందన్నారు. కడప నగరం లో భాగంగా కడప, చింతకొమ్మదిన్నె, చెన్నూరు మండలం లోని కొన్ని కడప నగర కార్పొరేషన్ చుట్టూ ఉన్న గ్రామాలలోను విలువైన ఇండ్ల స్థలాల ప్రభుత్వ భూములను ఫోర్జరీ సంతకాలతో డీకేటీ పటాల తయారీ ముఠాలు సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో స్వాధీనం చేసుకుని ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం బద్వేలు పట్టణం, కడప నగరాలలో ఫోర్జరీ సంతకాల ముఠాలపై నిఘా ఉంచినట్లు తెలిసిందన్నారు. వీరు మరింత చొరవతో ఫోర్జరీ సంతకాల డీకేటీ ముఠాలపై కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్జరీ సంతకాల డికెటి పట్టాల తయారీదారుల కారణంగా భూతగాదాలు పెరిగి శాంతిభద్రతల సమస్యలు అనేకం తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాల కు సంబంధించిన డీకేటీ ఫారాలు కూడా వినతి పత్రం తో జతచేసి అందిస్తున్నామని చెప్పారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బద్వేల్ రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1150/3లో 0.43 ఎకరాలు, 1151లో 2.99 ఎకరాలు, 1153 లో 4 ఎకరాలు, 1154 లో 4.56 ఎకరాలు వందల కోట్ల రూపాయల ఇండ్ల స్థలాలను, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే భూములే గాక వ్యవసాయ యోగ్యమైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కూడా బినామీ పేర్ల పై ఫోర్జరీ సంతకాలతో జిల్లాలో భూములు కబ్జాలకు గురయ్యాయని తెలిపారు. ముఖ్యంగా శ్రీ కాశీ నాయన మండలంలోని సావి శెట్టిపల్లె, ఇటుకుల పాడు, అక్కింగండ్ల పరిధిలోని రెవిన్యూ గ్రామాలలో సుమారు ఆరు వేల ఎకరాలకు పైగా కబ్జాకు గురైందని చెప్పారు. ఒంటిమిట్ట మండలం లోని జౌకుల పల్లిలో రెండు వేల ఎకరాలకు పైగా, సిద్ధవటం మండలం పెద్ద పల్లి గ్రామాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాలు కబ్జాకు గురైందని తెలిపారు. ఇలా అనేక ప్రాంతాలలో కబ్జాలకు గురయ్యాయని సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్ పాల్గొన్నారు.


Share

Related posts

అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల, భూకబ్జా కోరుల పేర్లు భహిర్గతం చేస్తాం – జి.ఈశ్వరయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్

manarayalaseema

రైల్వేకోడూరు లో AISF నూతన కమిటీ ఎంపిక – హాజరైన జిల్లా కార్యదర్శి గుజ్జల వలరాజు

manarayalaseema

నిప్పు కి చెదలు పట్టదని “గ్రేట్ ఆంధ్ర “కు తెలియదా ??

manarayalaseema

Leave a Comment