Uncategorized క‌డ‌ప‌

సరికొత్త ఆలోచనలతో.. ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలి – జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

Share

మనబడి “నాడు నేడు” కార్యక్రమం ద్వారా.. సరికొత్త ఆలోచనలు, నైపుణ్యతతో ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక రంగులు, హంగులతో రూపుదిద్దాలని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు

మాట్లాడుతున్న కలెక్టర్ విజయరామరాజు

శనివారం కలెక్టరేట్‌లోని సభాభవన్ లో.. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో..  మున్సిపల్, పంచాయతీరాజ్, ఏపీఈడబ్ల్యూఐడిసి శాఖలకు చెందిన ఇంజనీర్లు, సచివాలయాలకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అమినిటీస్ లకు.. రెండవ దశలో జిల్లాలో చేపట్టనున్న మనబడి నాడు- నేడు అభివృద్ధి పనుల నిర్వహణపై వర్క్ షాపు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ సి.ఎం.సాయికాంత్ వర్మ లు ముఖ్య అతిధులుగా హాజరై.. ఇంజనీరింగ్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. నాడు-నేడు పనుల్లో నాణ్యత, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని ఇంజనీరింగ్ సిబ్బందిని హెచ్చరించారు.

ఈ సందర్భంగా.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. రెండవ దశ  మనబడి నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా.. జిల్లా వ్యాప్తంగా 735 పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. కేవలం మనబడి నాడు-నేడు కార్యక్రమాన్నే కాకుండా.. గ్రామాల్లో ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురైనా.. పరిష్కరించాల్సిన బాధ్యత ఇంజనీర్లదే అన్నారు. మన గ్రామాలు బాగుపడాలంటే.. స్థానిక ఇంజనీరింగ్ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.

నాడు నేడు పనుల్లో.. పాఠశాల భవనాలకు సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా.. ఆహ్లాదకరమైన హంగులు, డిజైన్లతో భవనాలను తీర్చి దిద్దాలన్నారు.  వినూత్న రీతిలో ప్రయోగాత్మకంగా, సరికొత్త ఆలోచనలతో అధునాతన డిజైన్లను రూపొందించే  ఇంజనీరింగ్ సిబ్బందికి తప్పక ప్రోత్సాహం అందిస్తామన్నారు. నాడు-నేడు అభివృద్ధి పనుల్లో జిల్లా పాఠశాలలను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ సందర్భంగా.. జపాన్ దేశంలోని అంతర్జాతీయ ప్రామాణికాలతో ఆకట్టుకుంటున్న కిండర్ గార్డెన్ పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఉదహరిస్తూ.. సరికొత్త ఆలోచనలతో.. పాఠశాలల భవన నమూనాలను రూపొందించాలని.. ఇంజనీరింగ్ సిబ్బందిని ప్రోత్సహించారు.

** **ఇంజనీరింగ్ వృతికే స్ఫూర్తినిచ్చిన కలెక్టర్ వ్యాఖ్యలు..**

ఇంజనీరింగ్ వృత్తికే స్ఫూర్తినిచ్చేలా.. ఇంజనీర్ల విధులు, ఉద్యోగ బాధ్యతలను కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా ప్రాంతంలో పని చేసే ఇంజనీర్లు.. ఒక గ్రామానికి కాంటూర్ కందకాల ఆవశ్యకతను గుర్తించుకోవాలని అలాగే.. గ్రామానికి ఎన్ని రోడ్డు, రహదారులు, సరిహద్దులున్నాయో తెలుసుకుని.. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. గ్రామ లేదా వార్డు పాపులేషన్ కు అనుగుణంగా.. మంచినీటి సరఫరా వ్యవస్థను నిర్వహించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలతో పాటు.. వ్యవసాయానికి సాగునీటి సదుపాయాలను కల్పించే పంట కాలువలు ప్రధాన్యతతో చేపట్టాలన్నారు. ఇందుకోసం ఇరిగేషన్, శానిటేషన్ శాఖల ఇంజనీర్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు.

అనంతరం జేసీ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ.. విద్యా వవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. “నాడు-నేడు” ద్వారా జిల్లాలో మొదటి దశలో 1,040 పాఠశాలల్లో 10 రకాల మెరుగైన వసతులు కల్పిస్తూ.. నూతనంగా అబివృద్ది చేయడం జరిగిందన్నారు. రెండవ దశలో 735 పాఠశాలల రూపురేఖలు మారనున్నాయన్నారు. మొదటి దశ అభివృద్ధి పనులు జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని.. అదే స్ఫూర్తితో.. రెండవ దశ పనులను కూడా మరింత నాణ్యతాప్రమాణాలను పాటిస్తూ.. పాఠశాలలను అత్యంత అందంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.  ప్రతి స్కూలును తాను తనిఖీ చేస్తానని.. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత సచివాలయం ఇంజనీరింగ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా అందరూ అధికారులు, పేరెంట్స్ కమిటీల సమన్వయంతో.. కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఎస్టిమేషన్ , ఇన్పుట్ డేటా షీట్, లీడ్ స్టేట్మెంట్, రివాల్వింగ్ ఫండ్ అప్లోడింగ్ ప్రక్రియల్లో ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా.. త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మన జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కోట్ల రూపాయల నిధులు తల్లిదండ్రుల కమిటీ కీ జమ అయ్యిందని.. త్వరగా పనులు చేపట్టాలన్నారు.

అనంతరం.. ఛాయాచిత్ర ప్రదర్శనలో  ప్రదర్శించిన మొదటి దశ నాడు-నేడు పనుల్లో నిర్మించిన పాఠశాల భవనాల చిత్రాలు,  స్టాళ్లలో ప్రస్తుతం నిర్మాణాలకు ఉపయోగించే.. విద్యుత్, శానిటేషన్, ఫ్లోరింగ్, ఇతర ఫర్నిచర్ మెటీరియల్ ను కలెక్టర్, జేసీలు తిలకించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్.ఈ. శ్రీనివాస్ రెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్.ఈ., సమగ్ర శిక్ష ఇంజనీరు మురళీకృష్ణ, టెక్నికల్ అధికారులు పాలెం రాజా, సాయినాథ్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అమినిటీస్ తదితరులు పాల్గొన్నారు.


Share

Related posts

పురాతన విగ్రహాల గుర్తింపు….!

manarayalaseema

– వివేకా హత్య కేసుపై విచారణ స్పీడప్ చేసిన సిబిఐ

manarayalaseema

ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొజ్జా తిరుమలేష్

manarayalaseema

Leave a Comment