క‌డ‌ప‌ రాయ‌ల‌సీమ

నిప్పు కి చెదలు పట్టదని “గ్రేట్ ఆంధ్ర “కు తెలియదా ??

Share

గత రెండు రోజులుగా డిజిటల్ పత్రిక ‘గ్రేట్ ఆంధ్ర’ పని కట్టుకుని నిప్పుకు చెదలు పట్టించాలని, బిజెపి లోని యువ నాయకత్వం, దానిలో కులాలకు, ప్రాంతాలకు, అతీతంగా సిద్ధాంతం కోసం అహర్నిశలు పని చేస్తున్న యువ కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, కార్యకర్తల మధ్య అగాథం పెంచాలని, భవిష్యత్ తరం నాయకత్వాన్ని మొగ్గలోనే తుంచి వేయాలని కుట్రలో భాగంగా వ్యక్తుల పేర్లు జోడిస్తూ ఒక అనైతిక కథనాన్ని వండీవార్చింది. ఈ సందర్భంగా నేను చిన్నప్పటినుండి గమనిస్తున్న ఒక కార్యకర్త, సోదర సమానుడు నాగోతూ రమేష్ ని కూడా ఈ రొచ్చు లోకి లాగే ప్రయత్నం చేసింది.ఈ సందర్భంగా రమేష్ గురించి ఆ పత్రిక యాజమాన్యం, దాని రాతల ద్వారా శునకానందం పొందాలని తపిస్తున్న నాగోతు రమేష్ వ్యతిరేకులకు తేలియాల్సిన కొన్నింటిలో కొన్ని విషయాలు.

(1) విశ్వహిందూ పరిషత్ కార్యకర్తగా ఏకాత్మ రథయాత్రలో రోజుల తరబడి పాల్గొని కర్నూల్ జిల్లా వెలుగోడు సంఘటనలో రథము మీద దాడికి ప్రయత్నం చేసిన ముష్కరులను దీటుగా ఎదుర్కొని రథయాత్ర ను సవ్యంగా జరిగేలా రక్షణ గా నిలబడన వ్యక్తులలో ముక్యుడు.
(2) రాష్ట్రమంతటా విద్యార్థి సంఘం ఎన్నికలు ఆగిపోయిన, రాజంపేట కడపలో మాత్రమే ఎన్నికలు జరిగే ప్రాంతంలో ‘విద్యార్థి పరిషత్ కు’ గొప్ప విషయాలు చేకూరేలా కృషిచేసిన వ్యక్తిగా విద్యార్ధి లోకానికి సుపరిచితం
(3) స్వయంగా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ABVP ని స్థాపించి అనంతరం జరిగిన ప్రతి ఎన్నికలలో స్వయంగా తాను గెలిచి, ఎన్నికలు నిలిపివేసినప్పటి 2006 వరకూ అప్రతిహతంగా స్థానిక టిడిపి, కాంగ్రెస్, AISF, ఎస్ ఎఫ్ ఐ లాంటి అధికార, ప్రతిపక్ష నాయకుల అభ్యర్థులను ఏకపక్షంగా ఎదుర్కుని విజయతీరాలకు చేర్చిన చరిత్ర
(4) ఈ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలుల్లొ ఆనాటి అధికార పార్టీ టిడిపి AISF ఉమ్మడి అభ్యర్థి ఏబీవీపీ నాయకుల మీద దాడీ చేస్తే ఆ దాడిని సమర్దవంతంగా తిప్పికొట్టి తను, తన కుటుంబ సభ్యులు, మిత్ర బృందం అంతా జైలుకు పోయినా చలించని ఉదంతం అందరికీ తెలిసు
(5) తన బంధువులనీ కాదని సతీష్ రెడ్డి అనే కార్యకర్త కోసం నిలబడి గెలిపించి ,అసందర్భంగా జరిగిన ఫ్యాక్షన్ గొడవల వల్ల జైలు కూడు తిన్న సంఘటన కడప జిల్లా విద్యార్ధి లోకం నేటికి చెప్పుకొంటున్నారు
(6) అంతేకాకుండా కళాశాలకు సొంత నిధులతో భవనాలు కట్టించిన చరిత్ర కూడ రమేశ్ కే సొంతం.
(7) రైల్వే వంతెన సాదన కోసం చేసిన ఉద్యమాలు ,
(8) విద్యార్థుల సమస్యల మీద సెక్రటరియేట్ ని ముట్టడించి లాటి దెబ్బలకు వెరవక సెక్రటరియేట్ లోకి చొస్సుకు పోయినా చరిత్ర కూడా ఆయనది ,
చంద్రబాబు నాయుడు హయాంలో విద్యార్థుల స్కాలర్‌షిప్, విద్యారంగ సమస్యల మీద యూనివర్సిటీలో లో పోరాటం చెస్తె దానికి ప్రతిగా పోలీసులు తుపాకీ గుంద్లకు ఎదురొడ్డిన సంఘటన ఎప్పటికీ మరువలేనిదే.
(9) ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా ఉద్యమించే సమయంలో, పోలీసుల తుపాకీలకు తల అడ్డం పెట్టిన నైజం రమేశ్ ది.
(10) వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమంలో కడప సెంట్రల్ జైల్లో మగ్గిన, నేత!=అనంతపురంలో అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనలో తెలుగుదేశం వారు దాడి చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని తిప్పికొట్టిన దమ్మున్న నేతగా రమేష్ సుపరిచితుడు .
(11) యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యార్థి యువజన ఉద్యమాలు నడిపి ‘బాబు ఏది నా జాబు” అనే నినాదాన్ని లేవదీసి అధికార పార్టీ ఓడిపోవడానికి తారక మంత్రం లాగా పని చేసి జైలు పాలైన వ్యక్తి రమేశ్.
తన ప్రజల కోరిక మేరకు కడప జిల్లా నందు మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూచివారి పల్లి నందు అత్యధిక మెజారిటీతో గెలిచి అభివృద్ధిలో మొదటి ఐదు పంచాయతీల జాబితాలో స్థానం పొందిన పాలనాదక్షుడు.
(12) అధికారంలో ఎవరున్నా తన బలమైన గొంతుకను ప్రజా ప్రయోజనాలు కొసం వినిపిస్తూ, తను నమ్మిన పార్టీ ఆలోచనల ను తూచా తప్పకుండా పాటిస్తూ అందరి నాయకులకు తలలో నాలుక లాగా వుండే రమేష్ ,భవిష్యత్తులో వారసత్వ రాజకీయ నాయకులకు బలమైన ప్రత్యర్థి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
(13) విద్యార్ధి యువజన పోరాటాలు చేసి 35 కేసులు బనాయించబడ్డాయి వీటిలో ఎక్కువ శాతం చంద్రబాబు హయాంలోనే ? అప్పుడు పొగిడిన నోర్లు నేడు జగన్ ని ప్రశ్నిస్తే మాత్రం నాలిక మడత పెట్టి మాట్లాడతారా ?
​=ఎన్నో అవకాశాలను వదులుకొని సిద్ధాంతం కోసం పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు పాటు పడే రమేష్ ఈ బురద రాజకీయాల మీద విజయం సాదిస్తాడు అనే నమ్మకం నాకు వుంది


చివరగా నా స్వానుభవం 🙏

వాళ్ళ సొంత సామజిక వర్గం ఎంత వత్తిడి చేసిన కాపు నేపథ్యం అయిన నన్ను ఛైర్మెన్ గా దగ్గర వుండి గెలిపించాడు నన్ను , నాలాంటి వారిని ఎందరినో ప్రోత్సహించిన social engineer , విశ్వవిద్యాలయం నందే కులమకిలి అంటని నేత ,ఇలాంటి నిప్పును తాకాలనుకోవద్దు
విజయీభవ: ఓ మిత్రుడా ! విజయీభవః


కోనేటి యార్ల రాఘవేంద్ర కుమార్
మాజి కళాశాల యూనియన్ ఛైర్మెన్
కాపు యువజన సంఘం ప్రధాన కార్యదర్శి

Share

Related posts

కమ్యూనిస్టులను అవమానించడమంటే ప్రజల మనోభావాలను అగౌరపరచడమే..

manarayalaseema

సరికొత్త ఆలోచనలతో.. ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలి – జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

manarayalaseema

రాయలసీమ ఎత్తిపోతల పై టిడిపి వైఖరి స్పష్టం చేయాలి – అఖిల పక్ష నేతల డిమాండ్

manarayalaseema

Leave a Comment