పాలకొండలు…..
కడప పట్టణానికి ఆగ్నేయ దిశగా…….
వెలసిన ప్రకృతి హారాలు!
కనలకింపైన గిరులు!
వర్షఋతువునందు పచ్చని చెట్లతో……
కళకళలాడు సుందర ప్రదేశాలు!
గల గల పారే సెలయేళ్ళు!
జల జల దుమికే జలపాతాలు!
తేటతెల్లని ఉదకముతో……
కనిపించు తటాకములు!
కనుల పండుగజేయు……. కలువలు, తామరలు!
చుట్టూ కొండల వరుస!
పచ్చని చిరు అడవుల మధ్య!
వెలసె శ్రీ లక్ష్మీ పాలకొండ్రాయని కోవెల!
శ్రావణమాసమందు……
జనులు వెళ్ళుదురు……
విహారమునకు, దైవ దర్శనమునకు!
స్వకార్యము,స్వామికార్యము…చక్కబెట్టుటకు!

దారి వెంబడి కనిపించు…..
కలే పండ్లు, అక్కడక్కడ బిక్కి పండ్లు!
పెద్దలు, పిల్లలకివి భలే పసందు!
మనశ్శాంతికి,మానసిక ప్రశాంతతకు…………..
ఇవి చూడచక్కని ప్రదేశాలు!!
పి.వి.కృష్ణారావు, కడప.
9618858532.