అనంత‌పురం

తెలుగు పద్యకవులలో డా.జ్ఞానానందకవి స్థానం విశిష్టమైనది- వైస్ ఛాన్సలర్ టీ.కిషన్ రావు

sri hari
Share

తెలుగు పద్య కవులలో జ్ఞానానంద కవి గారి స్థానం విశిష్టమైనదని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య టీ.కిషన్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన శత జ యంతోత్సవ ప్రారంభసభ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు,రచయిత సాకే శ్రీహరిమూర్తి కి జ్ఞానానంద కవి సాహితీ పురస్కారం ప్రదానం చేశారు.
వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ప్రతి యేడాదీ ఇచ్చే పద్మశ్రీ డాక్టర్ జ్ఞానానందకవి సాహితీ పురస్కారాన్ని ఈ యేడాది అనంతపురానికి చెందిన రచయిత, పాత్రికేయుడు శ్రీ సాకే శ్రీహరిమూర్తికి ప్రదానం చేశారు.జ్యోత్స్నాకళాపీఠం ప్రధానకార్యదర్శి హ్యుమానిటీస్ డీన్ శరత్ జ్యోత్స్నారాణి ఆధ్వర్యంలో డా.జ్ఞానానందకవి 99వ జయంతి సభలో రూ.5116 లో నగదు, ప్రశంసాపత్రంతో సత్కరించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వ విద్యాలయ మాజీ రిజిస్ట్రార్ గౌరీ శంకర్,కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మాజీ డీన్,ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి, తెలుగుశాఖ అధ్యక్షులు దార్ల వెంకటేశ్వర రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు కుసుమా రెడ్డి,సాధన సంస్థ నరసింహాచార్యులు పాల్గొన్నారు


Share

Leave a Comment