ఎడ్యుకేషన్ క‌డ‌ప‌

విద్యకు పేదరికం అడ్డు కారాదన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం

Share

మాట్లాడుతున్న కమలాపురం యం.యల్.ఏ

🌀విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం..

🌀కమలాపురం శాసనసభ్యులు పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

🌀228 లక్షలతో 19 అదనపు తరగతులకు భూమి పూజ

అబ్బవరం ప్రభాకర్ రెడ్డి

విద్యకు పేదరికం అడ్డు కారదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని కమలాపురం శాసనసభ్యుడు పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం చింతకొమ్మదిన్నె మండలం జై కొత్తపల్లి గ్రామంలో రూ. 2.28 కోట్ల వ్యయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అవసరమైన 19 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం శాసన సభ్యులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, స్థానిక జడ్పిటిసి సభ్యులు పి. నరేన్ రామాంజనేయులు రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అదేవిధంగా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి లు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. విద్యార్థులకు ఉన్నత చదువులకు వారి పేదరికం అడ్డు కాకూడదు అనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకు రావడం జరిగిందన్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల దశ దిశ మార్చే విధంగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే దిశగా.. మనబడి నాడు-నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు మధ్యలోనే బడి మానేసే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధ్యార్థుల సంక్షేమ కోసం జగనన్న అమ్మ ఒడి ద్వారా బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాల్లో రూ. 15 వేలు జమ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా గడచిన రెండేళ్లలో సుమారు రూ. 800 కోట్లు నిధులను 2,65000 మంది తల్లులకు నేరుగా వారి ఖాతాల్లో జమ అయిందన్నారు. మంచి పౌష్టికాహారంతో కూడిన జగనన్న గోరుముద్ద మెనూ ను స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపొందించడం, విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్యం కూడా అంతేముఖ్యమని ఇలాంటి పథకాలు రూపొందించినట్లు చెప్పారు.
అనంతరం ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రం అయితే విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందో అక్కడ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అటువంటి జాబితాలో మన రాష్ట్రం ఉండడం మరియు ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థకు మరింత బలోపేతం చేయడం, రానున్న కాలంలో విద్య ద్వారానే కుటుంబాలలో పేదరికం పోతుందని, విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదన్నారు. శాసనసభ్యులు పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో.. దూరదృష్టితో విద్యా వ్యవస్థకు ప్రతి సంవత్సరం సుమారు రూ. 35 వేల కోట్లు నిధులు కేటాయిస్తూ, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. రానున్న కాలంలో మన రాష్ట్రం నుండి వివిధ రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో గొప్ప గొప్ప స్థానాలలో మన రాష్ట్ర విద్యార్థులు ఉన్నతమైన చదువులు అభ్యసించి వారి కుటుంబాలకు లక్షలాది రూపాయల జీతాలతో స్థిరపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకోవడం జరిగిందన్నారు. దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలని వారిని ఆశీర్వదించాలని అక్కడున్న ప్రజలనుద్దేశించి తెలిపారు.
మనబడి నాడు-నేడు ద్వారా కమలాపురం నియోజకవర్గానికి సుమారు రూ. 40 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని, దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి అందరూ సహకరించవలసిందిగా ఆయన సూచించారు. గతంలో బడులు తెరిచిన నాలుగు నెలలకు యూనిఫార్మ్ ఇచ్చేవారిని ఇప్పుడు బడులు తెరిచిన మొదటి రోజే విద్యార్థులందరికీ జగనన్న విద్య కానుక ద్వారా యూనిఫార్మ్, టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూ, సాక్షులు, బ్యాగు, బెల్టు మరియు ఆంగ్ల తెలుగు నిఘంటువు లాంటివి ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మన జిల్లా వ్యాప్తంగా 3750 ప్రభుత్వ పాఠశాలలో దశలవారీగా మనబడి నాడు-నేడు చేపడుతున్నామని, మొదటి దశలో 1040 ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 270 కోట్లు నిధులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అదేవిధంగా రెండో దశలో 1016 ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 300 కోట్లు నిధులతో దాదాపు 11 రకాల మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జగనన్న విద్య కానుక ద్వారా మన జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 70 వేల మంది విద్యార్థులకు గడిచిన రెండు సంవత్సరాలలో రూ. 100 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
విద్యా వ్యవస్థకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు సరాసరి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు నిధులు కేటాయిస్తూ.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కడప నగరపాలక డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, స్థానిక సర్పంచ్, మండల ఎంపిపి మరియు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రధానోపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Share

Related posts

సీఎం ఇలాకాలో బిసి ఎస్ఐ కి అన్యాయం!! సర్పంచ్ హత్య కేసుకు సంబంధించి విఆర్ కి

manarayalaseema

విద్యా దీవెన కాదు విద్యార్థుల పై ధగా దీవెన…. టీఎన్ఎస్ఎఫ్ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు వేణుగోపాల్

manarayalaseema

పురాతన విగ్రహాల గుర్తింపు….!

manarayalaseema

Leave a Comment