
కడప : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైసిపి నాయకులు గంగవరం శేఖర్ రెడ్డి అన్నారు. ఒంగోలు లో జరగనున్న జూనియర్ టెన్నికాయిట్ పోటీలకు వెళ్లున్న కడప టీం కు జమ్మలమడుగు వైసిపి నాయకులు గంగవరం శేఖర్ రెడ్డి డ్రస్ లతో పాటు రవాణా చార్జీలను సమకూర్చారు.కడప లో క్రీడాకారులకు డ్రస్ లను గంగవరం శేఖర్ రెడ్డి కుమారుడు గంగవరం హేమశేఖర్ రెడ్డి అందజేశారు.ఒంగోలు లో అద్బుతమైన ప్రతిభ కనభరించి జాతీయ స్థాయి కి ఏంపిక అవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో టెన్నికాయిట్ మహిళా కార్యదర్శి తొండూరు పవిత్ర పాల్గోన్నారు