ఒంటిమిట్ట : ఏకాశీలనగరం శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం అందరి సమన్మయంతో విజయవంతం చేయాలని అధికారులను టిటిడి ఇ ఓ జవహర్ రెడ్డి అన్నారు.

గురువారం వంటిమిట్టలోని కల్యాణ వేదిక వద్ద కళ్యాణోత్సవ ఏర్పాట్ల పరిశీలన.
కల్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను టిటిడి ఇ ఓ జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామ రాజు, జిల్లా ఎస్పీ కె కె అంబురాజన్, జిల్లా జాయింట్ కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ, ఇ ఎం సి – సిఇఓ ఎం. గౌతమి, టిటిడి జె.ఇ. ఓ. వి.వీరబ్రహ్హం లు పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కల్యాణోత్సవం వేదిక వద్ద చేరుకునేందుకు అనువైన ఏర్పాట్లు, అలాగే ప్రముఖులు, అత్యంత ప్రముఖుల ఎంట్రీ పాయింట్, పబ్లిక్ ఎంట్రీ పాయింట్, వారి సీటింగ్ ఏర్పాట్లు, ప్రసాదాల వితరణ పాయింట్లు, బ్యారికేడింగ్ ప్లాన్, పార్కింగ్ , టాయిలెట్స్ తదితర ఏర్పాట్లపై క్షుణ్ణంగా పరిశీలించి.. సంభందిత అధికారులకు సలహాలు, సూచనలు జారీ చేశారు.
కోదండరామస్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిఐపి, విఐపిలు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, తదనుగునంగా పక్కా ప్రణాళికలతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, అన్న ప్రసాదాలు పంపిణీ కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు చేశారు, అలాగే విఐపి వివిఐపి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్కడ ఈ పొరపాటు జరగకుండా ప్రణాళికతో పనులు చేపట్టాలని, కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం టిటిడి ఇ ఓ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేపు జరుగబోవు శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారని అన్నారు. మొదట రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కోదండ రామస్వామి గుడిని సందర్శించి అనంతరం కల్యాణ వేదికకు చేరుకొంటారని, కల్యాణం రాత్రి 8.00 గంటల నుండి రాత్రి 10.00 గంటలవరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం అంతా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుండి ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. దూరంగా ఉన్నవారు కూడా వీక్షించేందుకు వీలుగా ఎల్.ఇ. డి. స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కల్యాణోత్సవ ఏర్పాట్లు అన్ని టిటిడి మరియు జిల్లా యంత్రాంగం ద్వారా శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంకా చివరి దశలో మెరుగులు దిద్దుటకు తాను రావాల్సివచ్చిందని అన్నారు. ఈ కళ్యాణోత్సవానికి దాదాపు 50 వేల నుండి 60 వేల వరకు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా అధికంగా భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ నుండి 135 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చినవారు తిరిగి క్షేమంగా వెళ్లేందుకు అదనంగా బస్సులను రేసర్వలో ఏర్పాటు చేశామన్నారు. గత 2 సంవత్సరాలుగా కరోన కారణంగా కల్యాణ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఒంటిమిట్ట ఏకాశీలనగరం శ్రీ కోదండ రామస్వామి కళ్యాణోత్సవాన్ని అతి వైభవంగా, కనులవిందుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంప్రదాయ బద్ధంగా ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమర్పించనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తుల కోసం సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయమానంగా కల్యాణవేదిక తీర్చిదిద్దుతున్నామన్నారు. లక్ష మందికి పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ అక్షింతలు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని వెల్లడించారు. టిటిడి, జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన క్యూలైన్లు, బారికేడ్లు, పార్కింగ్, బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు కోసం శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఎస్వీబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ఆర్టిసివారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఒంటిమిట్టకు బస్సులు ఏర్పాటు చేశారని చెప్పారు. కల్యాణం తర్వాత భక్తులు తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అంతకుముందు ఈవో కల్యాణ వేదిక పరిసరాలు, ప్రవేశ మార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా కళ్యాణోత్సవానికి హాజరు కానున్నారని అన్నారు.
తదనంతరం టిటిడి ఇ ఓ జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామ రాజు, జిల్లా ఎస్పీ కె కె అంబురాజన్, జిల్లా జాయింట్ కలెక్టర్ సి ఎం. సాయికాంత్ వర్మ, ఇ ఎం సి – సి ఇ ఓ ఎం. గౌతమి, టిటిడి జె ఇ ఓ వి. వీరబ్రహ్మంలు శ్రీ కోదండ రామ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో ధర్మ చంద్రా రెడ్డి, డ్వామా, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు యదుభూషణ రెడ్డి, రామమోహన్ రెడ్డి, టూరిజం అధికారి రాజశేఖర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, ఎస్పిడిసిఎల్ ఎస్ఈ శోభా వాలేంటినా, జిల్లా ఫైర్ ఆఫీసర్ హనుమంత రావు, గ్రౌండ్ వాటర్ డి డి మురళీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి వెంకటసుబ్బయ్య, డి.ఎస్.పి.శివా రెడ్డి, పోలీస్, టిటిడి అసిస్టెంట్ ఏవిఎస్వో మనోహర్, ఈఈ సుమతి, డీఈ రాజశేఖర్, కళ్యాణ ఉత్సవాలకు విధులు నిర్వహించేందుకు వచ్చిన తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.